బాపట్ల పట్టణంలోని చీలు రోడ్డు ప్రధాన రహదారి వద్ద గత వారం రోజుల క్రిందట త్రాగునీరు పైపులైను పగిలిపోయి నీరు వృధాగా పోతున్న నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది మరమ్మత్తులు చేశారు. మళ్లీ సోమవారం మరో ప్రాంతంలో వాటర్ పైపు పగిలిపోయి త్రాగునీరు వృధాగా పోతున్నది. దింతో త్రాగునీరు కలుషితమవుతుందని ప్రజల ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.