బాపట్ల జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ తుషార్ డూడి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు, బంధువులతో నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి రోడ్లపై తిరగవద్దని బహిరంగ ప్రదేశాలలో మద్యం చేయవద్దని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు.