పిట్టలవానిపాలెం మండల కేంద్రంలో ఉమ్మడి గుంటూరు- కృష్ణ జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని మండల తెలుగు మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి ప్రారంభించారు. 2021 నవంబర్ 1వ తేదీ కి ముందుగా డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు అందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు తమ ఓటు వేయాలని కోరారు.