సైబర్ నేరాలపై బాపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ సీఐ అహ్మద్ జానీ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడారు. సైబర్ మోసాలకు గురైనప్పుడు 1930 నెంబర్ కు కాల్ చేయాలని పేర్కొన్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆన్లైన్ లింక్స్ ను ఓపెన్ చేయవద్దనీ, బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నాo డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము ఓటిపి చెప్పండి అని కాల్ చేసిన వారికి ఆధార్ కార్డు నెంబర్ చెప్పవద్దని వివరించారు.