బాపట్లలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన

73చూసినవారు
బాపట్ల పట్టణంలో సోమవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పరిషత్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ దేవాలయాల్లో అన్యమతస్తులకు ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వం విరమించుకోవాలని పేర్కొన్నారు. తిరుపతి లడ్డు అపవిత్రత పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేసి దోషులకు కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. పట్టణంలోని సీలు రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించి జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్