తక్కువ ధరలకే బియ్యం కందిపప్పు

65చూసినవారు
తక్కువ ధరలకే బియ్యం కందిపప్పు
ప్రజలకు తక్కువ ధరలకే బియ్యం,కందిపప్పు విక్రయిస్తున్నట్లు కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. గురువారం బాపట్ల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ నందు బియ్యం,కందిపప్పు స్టాల్ ను ఎమ్మెల్యే నరేంద్ర వర్మతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.అనంతరం లబ్ధిదారులకు తక్కువ ధరకే బియ్యం,కందిపప్పును అందజేశారు. బాపట్ల జిల్లాలో ఆరు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.