బాపట్ల: డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

59చూసినవారు
బాపట్ల: డంపింగ్ యార్డ్ ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్
బాపట్ల పట్టణంలోని డంపింగ్ యార్డును సోమవారం మున్సిపల్ కమిషనర్ జి. రఘునాథరెడ్డి పరిశీలించారు. యార్డులో చెత్త వ్యర్థాలను వేరు చేసే యంత్రాల పనితీరు పరిశీలించారు. ఘన వ్యర్ధలు, తడి చెత్త , పొడి చెత్త వేరుచేసి సంపద సృష్టించే విధంగా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. రోజుకు ఎన్ని మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు యార్డ్ కు వస్తాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు. యార్డ్ సిబ్బంది, రిజిస్టర్ తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్