బాపట్ల జిల్లా బాపట్ల పట్టణoలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ ను ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే వేగేశన మాట్లాడుతూ నియోజకవర్గంలోని రైతులందరూ తమ ఉత్పత్తులను నేరుగా రైతు బజార్లో అమ్ముకుని ఆర్థిక పరిపుష్టి పొందాలని ఆయన ఆకాంక్షించారు. రైతు బజార్ ఏర్పాటుతో దళారుల ఆటలు ఇక సాగవు అన్నారు.