ఎడ్లపాడు మండలంలోని కొండవీడు గ్రామంలో కోతముక్క ఆడుతూన్నరు అన్న సమాచారంతో ఆదివారం ఎస్సై వి.బాలకృష్ణ సిబ్బందితో దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 9, 880 రూపాయలు స్వాధీనం చేసుకొని వారిని స్టేషన్ కు తీసుకుని వచ్చి కేసు నమోదు చేశారు. ఎస్సై వి.బాలకృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చినచో వారిపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.