ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడానికి కృషి చేస్తున్నామని ఆర్టీసీ జోన్-3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు డిపో-1, 2 అధికారులతో గురువారం వెంకటేశ్వరరావు సమీక్షా సమావేశాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది సమయపాలనతో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని చెప్పారు. వరదల కారణంగా డిపోలలో ఎదురైన ఇబ్బందులను కూడా తన పర్యటనలో భాగంగా పరిశీలించానన్నారు.