ఉచితంగా కుళాయి కనెక్షన్: గుంటూరు కమిషనర్

56చూసినవారు
ఉచితంగా కుళాయి కనెక్షన్: గుంటూరు కమిషనర్
అమృత్ పథకంలో భాగంగా ఉచితంగా కుళాయి కనెక్షన్ అందిస్తామని కమిషనర్ పులి శ్రీనివాసులు గురువారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బీపీఎల్ వారికి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. అర్హులైన వారు స్థానిక వార్డ్ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ సూచించారు. తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండి, ఏడాదికి రూ. 5 వందలోపే ఆస్తి పన్ను కల్గిన వారి నివాసాలకు ఉచిత కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్