గుంటూరు : నా భర్తకు ఏ హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి

61చూసినవారు
నా భర్తకు ఏ హాని జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని బోరుగడ్డ అనిల్ కుమార్ సతీమణి మౌనిక హెచ్చరించారు. గుంటూరు రాజేంద్రనగర్ లో సోమవారం మీడియాతో మౌనిక మాట్లాడారు. తన భర్తపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కుటుంబాన్ని అనిల్ ఏ నాడు కించపరచలేదని, తాము జాతీయ ఎస్సీ కమిషన్ని ఆశ్రయించామని చెప్పారు. న్యాయపోరాటానికి సిద్ధమేనని అన్నారు.

సంబంధిత పోస్ట్