గుంటూరు నగరం జీటీ రోడ్డులో ప్రసిద్ధి గడించిన మస్తాన్ దర్గా 133వ ఉరుసు మహోత్సవాలకు సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా ఆలయ ధర్మ కర్త రావి రామ్మోహన్ రావు నేతృత్వంలో బుధవారం దర్గా వద్ద స్వాగత ద్వారాలు, విద్యుత్ దీపాలంకరణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 17 నుంచి ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాలకు గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.