గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని 3 వ నంబర్ ఓపీ వద్ద శుక్రవారం వెల్నెస్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ఎమ్మల్యే నసీర్ అహ్మద్ అతిథిగా హాజరై క్లినిక్ ప్రారంభించారు. ఆధునిక జీవన విధానంలో ఆహారపు అలవాట్లకు అనుగుణంగా వస్తున్న రోగాల నియంత్రణ, అవగాహన కోసం ఈ కేంద్రం పనిచేస్తుందని ఎమ్మెల్యే చెప్పారు. సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశశ్వి ప్రతి సోమవారం, బుధవారం క్లినిక్ అందిస్తామని చెప్పారు.