గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్కు 15 ఫిర్యాదులు, పీజీఆర్ఎస్ కు 48 ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు స్వయంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత గడువు లోపు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. డిప్యూటీ కమిషనర్లు శ్రీనివాసరావు, శ్రీనివాస్, సిటీప్లానర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.