శిక్ష పడే వరకు జనసేన పోరాటం చేస్తుంది: గాదె

76చూసినవారు
కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలని, డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లకు సెక్యూరిటీ కల్పించాలని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనకు మద్దతుగా బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిమాండ్లు నెరవేరేవరకు జనసేన అండగా ఉంటుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్