గుంటూరు చుట్టుగుంట సర్కిల్ సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఓ ద్విచక్ర వాహనదారుడు వేగంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో బైక్ పై ఉన్న యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.