కోల్కతాలో చోటు చేసుకున్న జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరులో ప్రదర్శన చేపట్టారు. మదర్ థెరిసా విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ పై హత్యాచారం చేసిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని సంస్థ ప్రతినిధులు సమా సుల్తానా, సారిక డిమాండ్ చేశారు.