వైఎస్సార్ యంత్ర సేవా పథకం - రాష్ట్ర స్థాయి రెండో మెగా మేళా సందర్భంగా గుంటూరుకు విచ్చేసిన సీఎం వైయస్
జగన్ కు
వైసీపీ నాయకులు ఆలా కిరణ్,
వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కాటూరి విజయ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం
జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయని రానున్న ఎన్నికలలో మళ్ళీ
వైసీపీ ప్రభుత్వం విజయం సాధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
వైసీపీ నాయకులు రెడ్డి కోటేశ్వరరావు, సందీప్, రాచకొండ నాని, రేణుక,
దోప్పలపూడి అంకాల రాజు, సంకూరి రాఘవ, శివన్న, తదితరులు పాల్గొన్నారు.