ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు, గ్రీవెన్స్‌లో వచ్చే వినతుల పరిష్కారంపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెట్టింది. నేరుగా లబ్ధిదారులకే ఫోన్ చేసి పథకాలు అమలు, సేవల్లో నాణ్యత, వినతుల పరిష్కారంపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. ఈ కాల్స్ ఆధారంగా ఆయా పథకాలు, కార్యక్రమాల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేయనున్నారు.