శోభితను కన్నబిడ్డలా చూసుకున్నామని ఆమె మామ బుచ్చిరెడ్డి అన్నారు. కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై శోభిత మామ బుచ్చిరెడ్డి స్పందించారు. ‘ఆమె కూడా మా అందరిలో చాలా బాగా కలిసిపోయింది. పెళ్లి అయ్యేంత వరకూ ఆమె సెలబ్రెటీ అని మాకు తెలియదు. నా కుమారుడు సుధీర్‌రెడ్డి, కోడలు శోభిత అన్యోన్యంగా ఉండేవారు. వారిద్దరి మధ్య ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవు. దేవుడు ఇలా చేయడం దురదృష్టకరం’ అని పేర్కొన్నారు.