బోరుగడ్డ అనిల్ పై బీజేపీ యువమోర్చా మాజీ కార్యదర్శి సురేష్ సోమవారం గుంటూరు పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీశ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. సురేష్ మాట్లాడుతూ గతంలో అమరావతి రైతుల ఉద్యమానికి వెళ్లి వస్తున్న మంత్రి సత్యకుమార్ ను అనిల్ ఆధ్వర్యంలో చంపుతానని, బెదిరించారనే ఆరోపణ పై జిల్లా ఎస్పీకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు బోరుగడ్డ అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.