వైసీపీ నగర మాజీ అధ్యక్షుడు రమేశ్ గాంధీ పేరిట నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించి అదే పేరుతో ఉన్న రౌడీషీటర్ పై పట్టాభిపురం స్టేషన్ కోర్ట్ కానిస్టేబుల్ కేసులు తీసివేయించాడు. రమేష్ గాంధీ పై పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. ఈ అవకాశాన్ని అదనుగా భావించిన కానిస్టేబుల్ గుంటూరుకు చెందిన రమేశ్ అనే షీటర్‌పై కేసులు తీసివేయించాడు. దీంతో అతడిని విధుల నుంచి అధికారులు శనివారం సస్పెండ్ చేశారు.