గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదు దారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎస్పీ సతీశ్ కుమార్, ఏఎస్పీ రమణమూర్తి, డీఎస్పీలు ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో చట్టపరిధిలో పరిష్కరించి వారికి తగిన న్యాయం చేయాలని ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.