దేశవ్యాప్తంగా ఈనెల 25 నుంచి అఖిల భారత పశు గణన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ గురువారం ఆవిష్కరించారు. పశు సంవర్ధక రంగంలో భవిష్యత్ ప్రణాళికా, విధాన రూపకల్పన కోసం ఈ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సేకరణదారులకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చి ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు.