గుంటూరు ఏటీ అగ్రహారంలోని ఎస్ కేబీఎం హైస్కూల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి జాతీయ పతాకాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల జీవితాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలన్నారు.