ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

74చూసినవారు
పెదకాకాని వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పెదకాకాని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనకనుంచి కారు ఢీకొట్టింది. ఆ కారును వెనుక నుంచి మరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు జీ జీహెచ్ కు తరలించారు. వైద్యులు కిరణ్ కుమార్ అత్యవసర వైద్య సేవలను అందించారు. ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్