గుంటూరు రూరల్ మండల పరిధిలోని పెదపలకలూరు గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా వర్ధంతి కార్యక్రమం స్వర్గీయ కారసాని శ్రీనివాసరావు కుమారుడు కారసాని వెంకటరత్నం నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగవీటి నరేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదల కోసం రంగా చేసిన కృషి వర్ణనానీతం అని అన్నారు. పలకలూరు లోని వృద్ధాశ్రమంలో వృద్దులకు బట్టలు పంచారు. కార్యక్రమంలో రూరల్ మండల యువత, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.