పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం అన్నారు. ఎస్పీ ఆదేశాలతో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సిబ్బందికి ఆయా స్టేషన్ల సీఐ, ఎస్ఐలు రోల్ కాల్ నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దాచేపల్లి సిఐ సిబ్బందికి నిర్వర్తించాల్సిన విధుల గురించి సలహాలు, సూచనలు చేశారు.