కూటమి ప్రభుత్వ హయాంలో గురజాలలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే యరపతినేని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఇంటింటికి వెళ్లి ‘ఇది మంచి ప్రభుత్వం' కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ. ఈ 100 రోజుల్లో 100కు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని ప్రజలకు వివరించారు. దసరా నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేస్తామన్నారు.