పల్నాడు జిల్లాలో వరుస దొంగతనాలు అందరిని కలవర పెడుతున్నాయి. బుధవారం ఒకే రోజు గురజాలలోని 4 ఇళ్లల్లో, పులిపాడులో 10 ఇళ్లల్లో, నడికుడిలో మూడు ఇళ్లల్లో, శ్రీనివాసరావుపేటలో1, పెద్ద గార్లపాడులో ఒక గృహాలలో చోరీ జరగటం సంచలనంగా మారింది. చోరీ ఘటనలు పోలీసులకు సవాల్ గా మారాయి. ఊరికి వెళ్లిన వారి ఇల్లే టార్గెట్ గా దొంగతనాలు పక్కా ప్రణాళికతో జరగటం, 4 ఊర్లలో 19 ఇల్లు చోరీ చేసిన ముఠా ఆనవాళ్లుకై వెతుకుతున్నారు.