కాపులను ముంచిన జగన్ : గళ్లా మాధవి

65చూసినవారు
కాపులను ముంచిన జగన్ : గళ్లా మాధవి
టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే వైకాపా దివాలా తీస్తుందని జగన్ రెడ్డికి భయంపట్టుకుం దని గుంటూరు పశ్చిమ నియోజక వర్గ టీడీపీ అభ్యర్థి గళ్ళ మాధవి ధ్వజమెత్తారు. శుక్రవారం గుంటూరు 20వ డివిజన్ సంపత్ నగర్ లో మల్లెల రాజేష్ నాయుడు, ఉగ్గిరాల సీతారామయ్య, వనమా నరేంద్రతో కలిసి గల్లా మాధవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారం కు విచ్చేసిన మాధవికి బిజెపి, జనసేన, టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్ర బాబు , పవన్ కళ్యాణ్ పై నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. చంద్రబాబు కాపు, బలిజ బాంధవుడు, జగన్ రెడ్డి కాపు ద్రోహి అని దుయ్యబట్టారు. ఎస్.వి యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా ఉన్నపుడే చంద్రబాబు బలిజ సామాజిక వర్గానికి చెందిన అంతరాజీ మోహన్ ను యూనివర్సిటీ చైర్మన్ చేశారు. కాపు కార్పొరేషన్ పెట్టి తగుస్థాయిలో నిధులిచ్చారన్నారు. కాపులకు 5శాతం రిజర్వషన్లు ఇచ్చారనీ కాపునేత రాజప్పను మొదటిసారి ఉపముఖ్యమంత్రిని చేసింది చంద్రబాబు మాత్రమే అని గుర్తు చేశారు.. కాపుల సంక్షేమానికి చంద్రన్న అన్నివిధాలా మంచే చేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్