మాచర్లలో 10 మద్యం షాపులకు 17 దరఖాస్తులు

61చూసినవారు
కూటమి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీ విధానంలో భాగంగా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని 10 మద్యం షాపులకు టెండర్ ద్వారా 17 అప్లికేషన్లు అందాయని మాచర్ల ఎక్సైజ్ సీఐ ఎన్. వెంకటరమణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రూ. 2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజులు కట్టవలసి ఉంటుందని చెప్పారు. ఈ నెల 9వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుంటామని 11వ తేదీ లాటరీ ద్వారా అర్హులను ఎంపిక చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్