ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఐదుగురికి మంజూరైన రూ. 5. 90 లక్షలవిలువగల చెక్కులను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి శనివారం లబ్ధిదారులకు అందజేశారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లబ్ధిదారులతోపాటు పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.