కంభంపాడు వైసిపిలో భగ్గుమన్న విభేదాలు

9221చూసినవారు
నివురు గప్పిన నిప్పులాగా ఉన్న వైసీపీలోని ఆధిపత్య పోరు శుక్రవారం పరస్పర రాళ్లు గొడ్డలితో దాడి చేసుకునే అంతవరకు వెళ్ళింది. వివరాల్లోకెళ్తే పల్నాడు జిల్లా మాచర్ల మండల పరిధిలోని కభంపాడు గ్రామంలో ఆరికట్ల చంద్రారెడ్డి, చిట్టి నాగిరెడ్డి ల మధ్య అధికార వైసీపీలో ఎప్పటినుండో ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం మద్యం మత్తులో ఉన్న వారు ఓ వ్యక్తిపై దాడి చేయడంతో వివాదం చెలరేగింది. పరస్పరం విచక్షణారహితంగా రాళ్లు రాడ్లు, గొడ్డళ్లుతో గ్రామంలో కొద్దిసేపు బీతావాహ వాతావరణాన్ని సృష్టించారు. ఈ దాడిలో చిట్టి నాగిరెడ్డి, భాస్కర్ రెడ్డి, రామిరెడ్డి తో పాటు పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుండి పంపించి వేశారు. ఇద్దరు అధికార పార్టీ నాయకులు కావడంతో వారిని సముదాయించేందుకు పోలీసులు నానా తిప్పలు పడ్డారు. రూరల్ సిఐ షేక్ షమీముల్లా ఎస్సై రాజశేఖర్ లో గ్రామంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇద్దరు ఒకే పార్టీ వారు కావటంతో పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా రాజీ చేస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్