ఎత్తిపోతల గిరిజన ఆశ్రమ పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ

995చూసినవారు
ఎత్తిపోతల గిరిజన ఆశ్రమ పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ
విద్యార్థుల భవిష్యత్ కు బాట వేసేలా ప్రభుత్వం జగనన్న విద్యా కానుకలు పంపిణీ చేస్తోందని మాచర్ల జెట్పీటీసి మల్లుస్వామి అన్నారు. మంగళవారం మండలంలోని ఎత్తిపోతల గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన విద్యా కానుకల పంపిణీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా డి.యస్.టి.డబ్ల్యు.ఈ. వరలక్ష్మితో కలిసి పాల్గొని విద్యార్థులకు విద్యా కానుక కిట్లను అందజేశారు. అనంతరం జెట్పీటీసి మల్లుస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. అమ్మఒడి, విద్యాదీవెన, విద్యాకానుక, వసతిదీవెన వంటి పథకాలతో పాటు పాఠ్య ప్రణాళిక, మౌలిక సదుపాయాల పరంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారన్నారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన రూ. 2400 ల విలువ గల విద్యా కానుక కిట్లను విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ప్రతి ఏటా అందిస్తుండడంతో పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గిందన్నారు. భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానం తో సుశిక్షితులు గా సర్కారు బడి పిల్లలను తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చర్యలు చేపట్టిందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ అలవరుచుకుని ప్రతిభావంతులు గా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్