పల్నాడు జిల్లా మాచర్ల మండలం కంభంపాడు గ్రామంలో కాకర్ల వెంకటేశ్వర్లు(55) అనే రైతు తన పొలంలో ఈరోజు ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం చేసిన 33 లక్షల అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.