కారంపూడి: ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు వినియోగించుకోవాలి

65చూసినవారు
కారంపూడి: ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు వినియోగించుకోవాలి
కారంపూడి మండలంలోని స్థానిక పట్టణం లో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ దిలీప్ సోమవారం ఉచిత పశువైద్య శిబిరాలను నిర్వహించారు. తంఅనంతరం డాక్టర్ దిలీప్ పశువులను పరీక్షించి, ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి వచ్చే ఈనెల 31వ తేదీ వరకు ఈ శిబిరాలు జరుగుతాయన్నారు. మండలంలో రోజుకు ఒక గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్