వీరుల తిరణాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని కారంపూడి దేవదాయ శాఖ అధికారి హనుమంతరావు తెలిపారు. శుక్రవారం వీరుల దేవాలయ ప్రాంగణాన్ని పీఠం నిర్వాహకులు విజయ్, పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవలతో కలిసి పరిశీలించారు. ఈనెల 30వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు వీరుల ఉత్సవాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.