మాచర్ల: మున్సిపల్ అధికారుల విస్తృత తనిఖీలు

51చూసినవారు
మాచర్ల: మున్సిపల్ అధికారుల విస్తృత తనిఖీలు
మాచర్ల పురపాలక సంఘ పరిధిలోని పలు దుకాణాలలో గురువారం పురపాలక సంఘ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. బృందాలుగా విడిపోయి పట్టణంలోని పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. పురపాలక సంఘ పరిధిలో ప్లాస్టిక్ ని నిషేధించిన నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. వ్యాపారులకు, వినియోగదారులకు అవగాహన కల్పించి తొలి విడతగా పలువురికి హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్