నాగార్జునసాగర్ 10 క్రస్ట్ గేట్లు ఎత్తివేత

74చూసినవారు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్ల నుంచి డ్యాం అధికారులు గురువారం నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 170946 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లగా వస్తుంది. దీంతో ప్రాజెక్ట్ అధికారులు క్రస్ట్ గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 590. 00 అడుగులు వద్ద ఉంది. ఇది 312. 0450 టీఎంసీలకు సమానం. కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్