పల్నాడు: అధికారి వేధిస్తున్నాడంటూ సూసైడ్ వీడియో

54చూసినవారు
మాచర్ల మండలం, తాళ్లపల్లి గ్రామపంచాయతీ సెక్రటరీ వేధిస్తున్నాడంటూ సచివాలయ సర్వేయర్ సూసైడ్ వీడియో విడుదల చేసిన ఘటన మంగళవారం సోషల్ మీడియాలో అల్చల్ అయింది. పంచాయతీ సెక్రటరీ తన పట్ల దురుసుగా వ్యవహరిస్తూ కులం పేరుతో చులకనగా చూస్తున్నాడని తనకు మరణమే శరణ్యం అంటూ తాళ్లపల్లి సమీపంలోని కుడికాలువ వద్ద ఏసురాజు వాపోయాడు. తనకు జరిగినటువంటివి మరొకరికి జరగొద్దని తెలిపారు. సహచరులు అతని కోసం గాలింపు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్