రెంటచింతల మండలంలోని సత్రశాల వద్ద కృష్ణానదిపై నిర్మితమైన నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు మూడు క్రస్ట్‌గేట్లు, రెండు యూనిట్ ద్వారా దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు 55, 634 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈ జయపాల్ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎగువనున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి వరద నీరు స్థానిక టెయిల్‌పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్‌కు వస్తున్నట్లు తెలిపారు.