వెల్దుర్తిలో అప్పుల బాధతో రైతు మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు. వేణుగోపాల రెడ్డి(65) అనే కౌలు రైతు తనకున్న ఎకరం పొలంతో పాటు మరో 6 ఎకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పత్తి, మిర్చి సాగులో కలిసి రాక అప్పులు పెరిగి సుమారు రూ. 20లక్షలు వరకు అప్పులు అయ్యాయని చెప్పారు. దీంతో బుధవారం పురుగు మందు తాగడం గమనించిన భార్య ఆసుపత్రికి తరలింస్తుండా మరణించాడన్నారు.