మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల బెడద నియంత్రణకు అధికారులు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా నగర పరిధి కాజలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ అలీమ్ భాషా శుక్రవారం తెలిపారు. కేంద్రాన్ని ఈనెల 23వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సెంటర్ ఏర్పాటుతో వీధి కుక్కల బెడద తగ్గుతుందని చెప్పారు.