మంగళగిరి తహశీల్దార్ కె. దినేశ్ రాఘవేంద్ర బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన షేక్ సుభానీ బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో పెదకాకాని నుంచి బదిలీపై వచ్చిన దినేశ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్వో, వీఆర్ఎ లు నూతన తహశీల్దార్ కు స్వాగతం పలికి అభినందలు తెలిపారు.