హైదరాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. పాస్టర్ మృతి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపించాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. చాగల్లులో జరిగే క్రైస్తవ సభలకు హాజరయ్యేందుకు రాత్రి ద్విచక్ర వాహనంపై రాజమండ్రి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.