కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సోమవారం భేటీ అయ్యారు. ఏపీలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ (ఎన్ఎఫ్ఎస్ఈ్యూ ) క్యాంపస్ ఏర్పాటు చేయాలని కృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. అలాగే బుడగ జంగాలకు సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలతో సహా వారి సామాజిక, ఆర్థిక అవసరాలను తీర్చడానికి సమగ్ర విధానాన్ని రూపొందించాలని కోరారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.