వర్షాలపై నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు శనివారం సమిక్షించారు. అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ స్వయంగా వార్డుల్లో పర్యటించి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అలెర్ట్ గా ఉండాలని అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అన్నారు. మ్యాన్ హోల్, కరెంట్ తీగల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.