స్థానిక నరసరావుపేట పరిధిలో పనసతోటలోని శ్రీ విద్యా వికాసిని స్టడీ సర్కిల్ నందు అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక జిల్లా జనరల్ సెక్రటరీ గుండాల రాకేష్ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ కవిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ పిలుపు మేరకు తెలుగు భాష పై మక్కువ కలిగించడానికి విద్యార్థుల మధ్య యువ కవుల సమ్మేళనం నిర్వహించడం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో పాల్గొన్న శ్రీ శ్రీ కళా వేదిక జిల్లా జనరల్ సెక్రెటరీ గుండాల రాకేష్ మాట్లాడుతూ" తెలుగు భాషను, సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడు పై ఉందని, నేటి సాంకేతిక యుగంలో ప్రతి పిల్లవాడికి తెలుగు పద్యం, వచనపక్రియలు, కథలు, సామెతలు నేర్పించాల్సిన అవసరం ప్రతి తల్లిదండ్రులపై ఉందని, తెలుగు భాషకు అమూల్యమైన సేవలు అందిస్తున్న శ్రీ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ అధ్యక్షులు డా. కత్తిమండ ప్రతాప్ కి, జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి కి, జాతీయ కార్యదర్శి జి. ఈశ్వరి భూషణం కి, రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సర్వోత్తమ నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కవి సమ్మేళనంలో పాల్గొని తమ కవితలు వినిపించిన యువకవులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సమ్మేళనంలో శ్రీ శ్రీ పల్నాడు జిల్లా యూత్ అధ్యక్షురాలు పఠాన్, కరిష్మా, షేక్ హాఫి, అమరలింగేశ్వరరావు, హు ప్రసన్నలక్ష్మి, సఫ్రున్నిసా, వినోద్, భాషా, సందాని, ఆనంద్ మరియు విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది.